నీళ్లు తాగేందుకు వెళ్లి.. గొర్రెల కాపరి మృతి

ABN , First Publish Date - 2020-03-04T10:17:56+05:30 IST

మండలంలోని గురిగింజకుంట గ్రామం దళితవాడకు చెందిన రాంబాబు (45) అనే గొర్రెల కాపరి నీళ్లు తాగేందుకు వెళ్లి ప్రమాదవ

నీళ్లు తాగేందుకు వెళ్లి.. గొర్రెల కాపరి మృతి

సంబేపల్లె, మార్చి 3: మండలంలోని గురిగింజకుంట గ్రామం దళితవాడకు చెందిన రాంబాబు (45) అనే గొర్రెల కాపరి నీళ్లు తాగేందుకు వెళ్లి ప్రమాదవ శాత్తు బావిలో పడి మృతి చెందాడు. గ్రామస్తుల వివరాల మేరకు.. రాంబాబు అతని భార్య గొర్రెలు మేపేందుకు ఒంటికొండమ్మ చెరువు సమీపంలోకి వెళ్లారు.


ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో మధ్యాహ్నం సమయంలో చెర్లోబావి వద్దకు వెళ్లి నీళ్లు తాగుతుం డగా.. ప్రమాదవశాత్తు బావిలో పడ్డాడు. బావిలో కత్తెర పాచి ఉండడంతో చిక్కుకున్నాడు. తన భర్తను కాపాడేందుకు ఆమె ప్రయత్నించినా ఫలితం దక్క లేదు. గ్రామస్తులు, స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. కాగా మృతుడు రాంబాబుకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. 

Updated Date - 2020-03-04T10:17:56+05:30 IST