గుట్కా ప్యాకెట్ల స్వాధీనం

ABN , First Publish Date - 2020-12-07T04:46:23+05:30 IST

కడప డీఎస్పీ సునీల్‌ ఆదేశాల మేరకు ఆదివారం సాయంత్రం కడప తాలుకా సీఐ నాగబూషణం ఆధ్వర్యంలో ఎస్‌ఐలు హుసేన్‌, రాఘవేంద్రరెడ్డి, సిబ్బందితో దుకాణాలు తనిఖీలు నిర్వహించారు.

గుట్కా ప్యాకెట్ల స్వాధీనం
వివరాలు వెల్లడిస్తున్న సీఐ నాగభూషణం

కడప(క్రైం), డిసెంబరు 6: కడప డీఎస్పీ సునీల్‌ ఆదేశాల మేరకు ఆదివారం సాయంత్రం కడప తాలుకా సీఐ నాగబూషణం ఆధ్వర్యంలో ఎస్‌ఐలు హుసేన్‌, రాఘవేంద్రరెడ్డి, సిబ్బందితో దుకాణాలు తనిఖీలు నిర్వహించారు. రవీంద్రనగర్‌లో గుట్కా విక్రయిస్తున్నఅహ్మద్‌ను అరెస్టు చేసి అతని వద్ద నుంచి రూ.50వేలు విలువచేసే వివిధ కంపెనీలకు చెందిన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని రిమాండుకు తరలిస్తున్నట్లు సీఐ తెలిపారు.


Read more