వాగులో కొట్టుకుపోయిన ఏఈ..

ABN , First Publish Date - 2020-11-27T07:01:17+05:30 IST

రాయచోటి మండల పరిధిలోని బొట్లచెరువు సమీపంలో గురువారం సాయంత్రం విధుల్లో భాగంగా వెళ్లి వాగులో కొట్టుకుపోయిన ఏఈ శివప్రసాద్‌రెడ్డి సురక్షితంగా బయటపడ్డారు.

వాగులో కొట్టుకుపోయిన ఏఈ..

చెట్లసాయంతో తప్పిన ప్రాణాపాయం

రాయచోటి, నవంబరు 26 : రాయచోటి మండల పరిధిలోని బొట్లచెరువు సమీపంలో  గురువారం సాయంత్రం విధుల్లో భాగంగా వెళ్లి వాగులో కొట్టుకుపోయిన ఏఈ శివప్రసాద్‌రెడ్డి సురక్షితంగా బయటపడ్డారు. మరొక వ్యక్తితో కలిసి ద్విచక్ర వాహనంపై వస్తుండగా బొట్ల చెరువు సమీపంలోని ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో కొట్టుకుపోయారు. సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు, విద్యుత సిబ్బంది వీరి కోసం గాలించారు. వాగులో కొంత దూరం కొట్టుకుపోయిన వీరు చెట్ల సాయంతో  బయటపడ్డారు. దీంతో వీరి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. 

Read more