ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : సీఈవో

ABN , First Publish Date - 2020-12-31T04:55:54+05:30 IST

ప్రభుత్వ పథకాలపట్ల ప్రజలకు అవగాహన కల్పించి, ప్రజల్లోకి తీసుకెళ్లాలని జడ్పీసీఈవో సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు.

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : సీఈవో
శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతున్న జడ్పీసీఈవో సుధాకర్‌రెడ్డి

ప్రొద్దుటూరు రూరల్‌, డిసెంబరు 30: ప్రభుత్వ పథకాలపట్ల ప్రజలకు అవగాహన కల్పించి, ప్రజల్లోకి తీసుకెళ్లాలని జడ్పీసీఈవో సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. హౌసింగ్‌బోర్డు కాలనీలోని ఎంపీడీవో కార్యాలయ సభాభవనంలో బుధవారం ఏర్పాటు చేసిన మైదుకూరు నియోజకవర్గ వెల్ఫేర్‌ అసిస్టెంట్ల శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న తోడు, వైయ్‌సఆర్‌ బీమా, వైఎ్‌సఆర్‌ పెన్షన్‌ కానుక, అమ్మఒడి, జగనన్న గోరుముద్ద, చేదోడు, కాపునేస్తం, నేతన్ననేస్తం, పేదలందరికి ఇళ్లు, వాహనమిత్ర వంటి పథకాలపై వెల్ఫేర్‌ అసిస్టెంట్లకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయాల్లో వెల్ఫేర్‌ అసిస్టెంట్లు అందరూ సమయపాలన పాటించాలన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలు అమలుపరుచుటలో సచివాలయాల పాత్ర చాలా ముఖ్యమని, అందులో వెల్ఫేర్‌ అసిస్టెంట్లు ప్రధాన భూమిక పోషించాలన్నారు. వెల్ఫేర్‌ అసిస్టెంట్లకు, సచివాలయాల సిబ్బంది, వలంటీర్లు, సహకరించాలన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవస్థపట్ల ప్రజలకు నమ్మకం కలిగే విధంగా ప్రతి ఒక్కరు పనిచేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో సుబ్రహ్మణ్యం, మైదుకూరు సాంఘిక సంక్షేమ అధికారి రామాంజనేయులు, హాస్టల్‌ సంక్షేమ అధికారులు గుప్త, నాగరాజు, నాయక్‌, శ్యామ్‌, ప్రభాష్‌, మైదుకూరు నియోజకవర్గస్థాయి వెల్ఫేర్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-31T04:55:54+05:30 IST