ఘనంగా విగ్రహ ప్రతిష్ఠోత్సవాలు

ABN , First Publish Date - 2020-12-30T05:35:17+05:30 IST

పట్టణంలోని శ్రీ భగవాన్‌ కాశినాయన ఆధ్వర్యంలో ఉమామహేశ్వరస్వా మి సువర్చల సమేత అభయ ఆంజనేయస్వామి ధ్వజస్తంభ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.

ఘనంగా విగ్రహ ప్రతిష్ఠోత్సవాలు
జమ్మలమడుగులో కలశపూజకు బిందెలతో నీరు తీసుకెళుతున్న మహిళలు

జమ్మలమడుగు రూరల్‌, డిసెంబరు 29: పట్టణంలోని శ్రీ భగవాన్‌ కాశినాయన ఆధ్వర్యంలో ఉమామహేశ్వరస్వా మి సువర్చల సమేత అభయ ఆంజనేయస్వామి ధ్వజస్తంభ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలు ఈనెల 28వ తేదీన ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా  మంగళవారం ఉదయం సుప్రభాతసేవ, సుందరకాండ పారాయణం, మండల పూజ తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం అష్టోత్తర శతకలశ దీపసహిత గ్రామోత్సవం నిర్వహించి ప్రసాదం పంపిణీ చేశారు. రాత్రి ధాన్యాదివాసం తదితర పూజలు చేశారు. ఈనెల 30వ తేదీ (బుధవారం) ఉదయం 11.34 గంటలకు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించేందుకు కాశీనాయన దేవాలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశా రు. అలాగే మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంటుందన్నారు. భక్తులు హాజరై జయప్రదం చేయాలని వారు కోరారు. 

Updated Date - 2020-12-30T05:35:17+05:30 IST