నష్టపోయిన ప్రతి రైతుకూ పరిహారం అందాలి
ABN , First Publish Date - 2020-12-12T05:17:43+05:30 IST
తుఫాన్‌తో పంటలు నష్టపోయిన ప్రతి రైతుకూ పరిహారం అందాలని, అలసత్వం వహిస్తే సహించేది లేదని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అధికారులను హెచ్చరించారు.
ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి
లక్కిరెడ్డిపల్లె, డిసెంబరు11: తుఫాన్‌తో పంటలు నష్టపోయిన ప్రతి రైతుకూ పరిహారం అందాలని, అలసత్వం వహిస్తే సహించేది లేదని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అధికారులను హెచ్చరించారు. శుక్రవారం ఆయన మండలంలోని మద్దిరేవుల, పందిళ్లపల్లె, కర్నూతల, దిన్నెపాడు గ్రామాల్లో తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా పం దిళ్లపల్లె, కర్నూతల గ్రామ సచివాల్లో వ్యవసా య, ఉద్యానశాఖ, రెవెన్యూ, ఇరిగేషన్, ట్రాన్స్‌కో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ యన మాట్లాడుతూ పంటలు నష్టపోయిన ప్రతి రైతుకూ పరిహారం అందాలని అధికారులను ఆ దేశించారు. పంటలను పూర్తిగా నమోదు చేయ డం లేదని రైతులు ఆయన దృష్టికి తీసుకురావడంతో వ్యవసాయాధికారి సురే్‌షపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ జెడ్పీటీసీ మద్దిరేవుల సుదర్శన్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యుడు రవిరాజు, సింగిల్‌విండో అధ్యక్షులు యర్రంరెడ్డి, సుబ్బారెడ్డి పాల్గొన్నారు.