మెరుగైన వైద్య సేవలు అందించాలి

ABN , First Publish Date - 2020-12-18T05:01:44+05:30 IST

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా అదనపు వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ రామిరెడ్డి సూచించారు.

మెరుగైన వైద్య సేవలు అందించాలి

లక్కిరెడ్డిపల్లె, డిసెంబరు17: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా అదనపు వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ రామిరెడ్డి సూచించారు. గురువారం దేవళంపల్లెలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో దేవళంపల్లె, కోనంపేట డాక్టర్లు, సిబ్బందితో ఆయన మా ట్లాడారు. కంటి వెలుగు, కొవిడ్‌ వ్యాక్సిన్‌ నిర్వహణ, మలేరియా, డెంగ్యూ తదితర అంశాలపై చర్చించారు.డాక్టర్‌ రియాజ్‌బేగ్‌, సబ్‌యూనిట్‌ అధికారి వై.ప్రసాద్‌, రేఖానాయక్‌, శంకర్‌ప్రసాద్‌, సీహెచ్‌వో, సూ పర్‌వైజర్స్‌ సురేంద్రరెడ్డి, మణి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-18T05:01:44+05:30 IST