గ్రేటర్‌ ఫలితాలతో ఉత్సాహంగా ముందుకెళ్లాలి

ABN , First Publish Date - 2020-12-06T04:48:08+05:30 IST

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయాన్ని సాధించడంపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్నాటి యల్లారెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ అదే ఉత్సాహం తో నేతలు, కార్య కర్తలు ఏపీలో ముందుకెళ్లాలని సూచించారు.

గ్రేటర్‌ ఫలితాలతో ఉత్సాహంగా ముందుకెళ్లాలి
ఎంపీ సీఎం రమే్‌షను కలిసి మాట్లాడుతున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్నాటి యల్లారెడ్డి

ఎర్రగుంట్ల, డిసెంబరు 5: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయాన్ని సాధించడంపై  బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్నాటి యల్లారెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ అదే ఉత్సాహం తో నేతలు, కార్య కర్తలు ఏపీలో ముందుకెళ్లాలని సూచించారు. శనివారం పోట్ల దుర్తిలో ఎంపీ సీఎంరమే్‌షను ఆయన కలిసి జీహెచ్‌ఎంసీ ఫలితాలపై ఆనందాన్ని పంచుకున్నారు. బీజేపీ వ్యూహం జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బాగా ఫలించిందని, ఓటర్లు మార్పు కోరుకున్నారని అర్థమౌతోందన్నారు. కడప జిల్లాలో  బీజేపీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వారు చర్చించారు. అలాగే తిరుపతి ఎమ్మెల్యే బై ఎలక్షన్‌పై కూడా బీజేపీ హైకమాండ్‌ ఇచ్చే సూచనల మేరకు పనిచేసేందుకు ప్రణాళికను వారు సిద్ధ్దం చేస్తున్నారు. రాష్ట్రంలో కూడా బీజేపీ అధ్యక్షుడు త్వరలో తిరుపతిలో ప్రత్యేక సమావేశం నిర్వహించి అభ్యర్థి ఎన్నికపై దృష్టి పెడుతున్నట్లు తెలిపారు. కలిసికట్టుగా పనిచేసి తిరుపతిలో బీజేపీ జెండాను ఎగురవేసేందుకు హైకమాండ్‌ పటిష్టంగా ప్రణాళిక సిద్ధ్దం చేస్తున్నట్లు తెలిపారు. రిటైర్డ్‌ ఐఏఎ్‌సని బీజేపీ అభ్యర్థిగా ఎంపిక చేసే విషయం ఆలోచిస్తున్నట్లు తెలిపారు. 

Updated Date - 2020-12-06T04:48:08+05:30 IST