-
-
Home » Andhra Pradesh » Kadapa » geenary
-
తిరుమలను తలపిస్తున్న.. ఆంధ్రాభద్రాద్రి ఒంటిమిట్ట కోదండరాముని ఆలయ ప్రాంగణం!
ABN , First Publish Date - 2020-12-16T05:02:07+05:30 IST
ఆంధ్రాభద్రాద్రి ఒంటిమిట్ట కోదండరాముని ఆలయ ప్రాంగణం పచ్చదనంతో కళకళలాడుతోంది.

పచ్చ..పచ్చగా...
ఎటు చూసినా హరితవనాలు.. అందమైన మొక్కలు
తిరుమలను తలపిస్తున్న పచ్చదనం
ఆంధ్రాభద్రాద్రి ఒంటిమిట్ట కోదండరాముని ఆలయ ప్రాంగణం పచ్చదనంతో కళకళలాడుతోంది. టీటీడీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉద్యానవనాలు అందరినీ కనువిందు చేస్తున్నాయి. భారీ వర్షాలు ఆగిన తరువాత ఆలయం చుట్టూ ఏర్పాటు చేసిన ఉద్యానవన మొక్కలను సంబంధిత సిబ్బంది అందంగా చేయడంతో పచ్చదనాలను ఆరబోసినట్లుంది. ఆలయం చుట్టూ రకానికో మొక్కను నాటి పెద్ద ఎత్తున వన సంరక్షణ చేపట్టారు. వీటికోసం ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి వాటిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు చెట్లు ఏపుగా పెరిగి అందంగా కనిపిస్తున్నాయి. కడప-చెన్నై హైవే రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన ఈ ఉద్యానవనాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
- రాజంపేట