21టీఎంసీలకు చేరిన గండికోట నీటిమట్టం
ABN , First Publish Date - 2020-12-14T04:43:22+05:30 IST
గండికోట ప్రాజెక్టులో ఆదివారం సాయంత్రానికి 21టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు.

కొండాపురం, డిసెంబరు 13: గండికోట ప్రాజెక్టులో ఆదివారం సాయంత్రానికి 21టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. కాగా ప్రాజెక్టులోకి వచ్చే జీఎన్‌ఎ్‌సఎ్‌స మెయిన్ కెనాల్ ద్వారా 500 క్యూసెక్కులు, క్యాచ్‌మెంట్ ద్వారా 2500 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా ప్రాజెక్టు నుంచి ఔట్‌ఫ్లో లేకపోవడంతో ప్రాజెక్టులో నీరు వేగంగా పెరుగుతోంది.