గండి హుండీ ఆదాయం ఎంతంటే...

ABN , First Publish Date - 2020-12-31T05:08:10+05:30 IST

నెలరోజుల గండి వీరాంజనేయస్వామి వారి హుండీ ఆదాయం రూ.13,35,442 వచ్చిందని సహాయ కమిషనర్‌ పట్టెం గురుప్రసాద్‌ తెలిపారు.

గండి హుండీ ఆదాయం  ఎంతంటే...
హుండీ లెక్కింపును పర్యవేక్షిస్తున్న సహాయ కమిషనర్‌ గురుప్రసాద్‌

చక్రాయపేట, డిసెంబరు 30: నెలరోజుల గండి వీరాంజనేయస్వామి వారి హుండీ ఆదాయం రూ.13,35,442 వచ్చిందని సహాయ కమిషనర్‌ పట్టెం గురుప్రసాద్‌ తెలిపారు. గండి వీరాంజనేయస్వామి క్షేత్రంలో బుధవారం సహాయ కమిషనర్‌ ఆధ్వర్యంలో హుండీల లెక్కింపు చేపట్టారు. కార్యక్రమంలో జిల్లా కార్యాలయం నుంచి ఇన్‌స్పెక్టర్‌ జనార్ధన్‌, బ్యాంకు అధికారులు శివ, దివ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-31T05:08:10+05:30 IST