రైతులకు వైసీపీ ప్రభుత్వం చేసిందేమిటి..?
ABN , First Publish Date - 2020-09-14T09:45:16+05:30 IST
సీపీ ప్రభు త్వంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు చేసిందేమీలేదని మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఆదినారాయణరెడ్డి విమర్శించారు.
మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి
జమ్మలమడుగు రూరల్, సెప్టెంబరు 13: వైసీపీ ప్రభు త్వంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు చేసిందేమీలేదని మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఆదినారాయణరెడ్డి విమర్శించారు. దేవగుడిలో ఏర్పాటు చేసిన బీజేపీ నేతలు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రం కిసాన్ పేరుతో ఒక్కో రైతుకు వారి వారి ఖాతాల్లో రూ.2 వేలు జమ చేస్తోందన్నారు.
నేటి నుంచి బీజేపీ సేవా వారోత్సవాలు
ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు బీజేపీ సేవా కార్యక్రమాలు(సేవా సప్తాహం) నిర్వహిస్తున్నట్లు మాజీమం త్రి, బీజేపీ నేత దేవగుడి ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు. 14న పేదల కాలనీల్లో, ఆస్పత్రుల్లో పండ్లు, మాస్కులు, శానిటైజర్లు పంపిణీ, 15న మొక్కలు నాటడం, 16న ప్రధానమంత్రి మోదీ ఫొటోల ప్రదర్శన, ఆయన జీవితం, లక్ష్యంపై సెమినార్ ఉంటుందన్నారు. 17న రక్తదాన శిబిరాలు, 18న దివ్యాంగులకు కృత్రిమ అవయవా లు ఇవ్వడం, 19న గ్రామాల్లో పరిశుభ్రత చర్యలు చేపట్టడం, 20న ప్రతిజిల్లాలోని ముఖ్య పట్టణాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు.
బీజేపీ కార్యకర్తల సంబరాలు
మాజీ మంత్రి సి.ఆదినారాయణరెడ్డిని రాష్ట్ర ఉపాధ్యక్షు డిగా నియమించడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపి పూలమాలలతో సత్కరించి సంబ రాలు చేసుకున్నారు. పార్టీ నాయకుడు శ్రావణ్‌కుమార్, మైనార్టీ నాయకుడు సయ్యద్, తదితరులు పాల్గొన్నారు.