నష్టపోయిన ప్రతి రైతుకూ న్యాయం చేయాలి

ABN , First Publish Date - 2020-12-14T04:49:12+05:30 IST

వర్షాలకు నష్టపోయిన ప్రతిరైతుకూ న్యాయం చేయాలిన టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి డిమాండ్‌ చేశారు.

నష్టపోయిన ప్రతి రైతుకూ న్యాయం చేయాలి
నష్టపోయిన వరి రైతుతో మాట్లాడుతున్న శ్రీనివాసరెడ్డి

 టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి 

చిన్నమండెం, డిసెంబరు 13: వర్షాలకు నష్టపోయిన ప్రతిరైతుకూ న్యాయం చేయాలిన టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి డిమాండ్‌ చేశారు.  ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న వరద ప్రభావిత ప్రాంతాలలో ఆయన పర్యటించారు. తొలుత  కలిబండ పాలేటమ్మ ఆయలంలో పూజలు నిర్వహించారు. కలిబండ ప్రాంతంలో పూర్తిగా దెబ్బతిన్న వరి రైతులతో పొలంలోకి వెళ్లి పరామర్శించారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన నష్టపరిహారం అందే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దళితవాడ వద్ద ఉన్న అయ్యన్న కుంట మొరవపెంచడంతో పట్టాభూములు మునిగిపోతున్నాయని, రైతులు ఆయన దష్టికి తెచ్చారు. అనంతరం కమ్మపల్లె పంచాయతీ భవనం సొసైటీ పేరు మీద ఉందని, అయితే దాన్ని కొందరు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని స్థానికులు ఆయన తెలిపారు. ఈ విషయమై సంబందిత అధికారులతో మాట్లాడి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. కేశాపురంలో బోర్లు ఉన్నప్పటికీ వాటికి మోటార్లు వేయడం లేదని స్థానికులు చెప్పడంతో ఆర్‌డబ్య్లుఎస్‌ డీఈతో ఆయన మాట్లాడి త్వరగా మోటార్లు వేయించాలని   కోరారు.  వరదలతో దెబ్బతిన్న  పంటల బీమా నష్టపరిహారంలో అధికారులు అధికారపార్టీకి కొమ్ముకాస్తున్నారని, కేశాపురం టీడీపీ నాయకులు రెడ్డెప్ప, నాగేంద్ర ఆయన దృష్టికి తెచ్చారు.  దీంతో ఆయన వెంటనే వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకుడితో ఫోన్‌లో మాట్లాడి నష్టపోయిన ప్రతి రైతుకూ న్యాయం చేయాలని కోరారు.రామనాధపురం వద్ద తెగిపోయిన హంద్రీ-నీవా కాలువను పరిశీలించి తెగిపోయిన కాలువతో మట్టిదిన్నెలతో నష్టపోయిన వరిమడి, టమోటారైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రాయచోటి మాజీ మండల ఉపాధ్యక్షుడు అనుంపల్లె రాంప్రసాద్‌రెడ్డి, టీడీపీ రాయచోటి మండల అధ్యక్షుడు వెంకటసుబ్బారెడ్డి, చిన్నమండెం మండల పార్టీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగభూషణం, నాయకులు రెడ్డెప్ప, నాగేంద్ర, మాజీ సర్పంచ్‌ మల్లికార్జున, అక్రమ్‌, మల్‌రెడ్డి, రాజారెడ్డి, శివప్పనాయుడు, రవి, రాంప్రసాద్‌నాయుడు, బాషీద్‌, బాకీ, శివయ్య, గోపాల్‌, వెంకట్రమణతో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-14T04:49:12+05:30 IST