పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంటు ఇవ్వాలి

ABN , First Publish Date - 2020-12-30T05:41:20+05:30 IST

కొత్తగా ప్రభుత్వం విడుదల చేసిన జీవో 77ను వెంటనే రద్దు చేసి పీజీ, ఆపై చదువుతున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, వసతి దీవెనలు ఇవ్వాలని పీడీఎస్‌వో రాయలసీమ కన్వీనర్‌ ఓబు లేసు కోరారు.

పీజీ విద్యార్థులకు   ఫీజు రీయింబర్స్‌మెంటు ఇవ్వాలి
తహసీల్దారు నజీర్‌ అహ్మద్‌కు వినతి పత్రం ఇస్తున్న విద్యార్థి సంఘాల నాయకులు

ప్రొద్దుటూరు రూరల్‌, డిసెంబరు 29 : కొత్తగా ప్రభుత్వం విడుదల చేసిన  జీవో 77ను వెంటనే రద్దు చేసి పీజీ, ఆపై చదువుతున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, వసతి దీవెనలు ఇవ్వాలని పీడీఎస్‌వో రాయలసీమ కన్వీనర్‌ ఓబు లేసు కోరారు. ఈ మేరకు పీడీఎస్‌వో, డీఆర్‌ఎస్‌ఎఫ్‌ విదార్థి సంఘాల ఆధ్వర్యంలో తహసీల్దారు నజీర్‌ అహ్మద్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవోనెం.77 వలన పేద, మధ్యతరగతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు పై చదువులకు దూరమయ్యే పరిస్థితి ఉందన్నారు. పాదయాత్ర సందర్భంలో ఎన్నికల మేనిఫేస్టోలో చెప్పిన విధంగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌, జగనన్న విద్యాదీ వెన వంటి పథకాలను కొనసాగించాలన్నారు. ఈ కార్యక్ర మంలో టీఆర్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు జయరాజు, తదిత రులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-30T05:41:20+05:30 IST