-
-
Home » Andhra Pradesh » Kadapa » For admission to engineering colleges Web option from today
-
ఇంజనీరింగ్ కళాశాలల్లో చేరికకు నేటి నుంచి వెబ్ ఆప్షన
ABN , First Publish Date - 2020-12-28T05:42:16+05:30 IST
ఎంసెట్‌లో ర్యాంకు సాధించిన వారికి ఇంజనీరింగ్ కళాశాలల్లో భర్తీ కొరకు సోమవారం నుంచి వెబ్ ఆప్షన ప్రక్రియ ఆనలైన ద్వారా ప్రారంభమవుతుందని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, ఎంసెట్ జిల్లా కో-ఆర్డినేటర్ పి.వి.కిష్ణ్రమూర్తి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

కడప (ఎడ్యుకేషన), డిసెంబరు 27 : ఎంసెట్‌లో ర్యాంకు సాధించిన వారికి ఇంజనీరింగ్ కళాశాలల్లో భర్తీ కొరకు సోమవారం నుంచి వెబ్ ఆప్షన ప్రక్రియ ఆనలైన ద్వారా ప్రారంభమవుతుందని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, ఎంసెట్ జిల్లా కో-ఆర్డినేటర్ పి.వి.కిష్ణ్రమూర్తి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 28, 29 తేదీల్లో 1వ ర్యాంకు నుంచి 60 వేల వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చన్నారు. 30, 31 తేదీల్లో 60,001 నుంచి చివరి ర్యాంకు వరకు వెబ్ ఆప్షన్స నమోదు చేయాలన్నారు. జనవరి 1న ఆప్షనలో మార్పులు చేసుకునే అవకాశం ఉందన్నారు. 3వ తేదీ సాయంత్రం 6 గంటల తరువాత అలాట్‌మెంటు వస్తుందని, ఇతర వివరాలకు ఏపీ ఎంసెట్ వెబ్‌సైట్ చూడాలని పేర్కొన్నారు.