కరోనా నివారణకు కలిసిరండి

ABN , First Publish Date - 2020-03-25T09:57:55+05:30 IST

కరోనా వ్యాప్తి చెందకుండా అధికార యంత్రాంగం తీసుకునే చర్యలకు అనుగుణంగా కలిసి రావాలని జిల్లా ఎస్‌పీ

కరోనా నివారణకు కలిసిరండి

పోలీసు సూచనలు పాటించండి 

అనవసరంగా బయటికి వస్తే కఠిన చర్యలు 

ఎస్‌పీ అన్బురాజన్‌


ప్రొద్దుటూరు క్రైం, మార్చి 24 : కరోనా వ్యాప్తి చెందకుండా అధికార యంత్రాంగం తీసుకునే చర్యలకు అనుగుణంగా కలిసి రావాలని జిల్లా ఎస్‌పీ అన్బురాజన్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. పోలీసు సూచనలు పాటించాలని, అనవసరంగా ఇంటి నుంచి బయటికి వస్తే వారిపై కఠిన చర్య లు తీసుకుంటామని హెచ్చరించారు. మంగళవా రం ఎస్‌పీ అన్బురాజన్‌ ప్రొద్దుటూరు వచ్చి కరో నా నివారణ దిశగా ఇక్కడి పోలీసు అధికారులు తీసుకున్న చర్యలను పరిశీలించారు. ఇక్కడి ని ఘా వ్యవస్థను, పట్టణ శివారుల్లో ఏర్పాటు చేసి న చెక్‌పోస్టులను  తనిఖీ చేశారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కరోనాను కట్టుదిట్టం చేసే దిశగా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రజలు ప్రభుత్వ చర్యల కు అనుగుణంగా నడుచుకోవాలన్నారు.


అత్యవసరమైతేనే బయటికి రావాలని, వచ్చినా సోషియల్‌ డిస్టెన్స్‌ పాటించాలన్నారు. ప్రతి ఒక్కరు కరోనా ప్రబలకుండా డాక్టర్లు సూచిస్తున్న ఆరోగ్య సూత్రాలను తూ,చ. తప్పక పాటించాలన్నారు. బుధవారం నుంచి మరింత కఠిన చర్యలు తీసుకుంటున్నామని, 11 తర్వాత ఎవ్వరు కూడా బయటికి రాకూడదని వస్తే అలాంటివారిపై కేసులు పెట్టేందుకు కూడా వెనుకాడమన్నారు. ద్విచక్రవాహనంలో ఒకరిని మాత్రమే అనుమతిస్తామన్నారు. ఆటోలు తిరగనివ్వమన్నారు.


ఆటోలకు పెట్రోలు పట్టవద్దని పెట్రోలు బంకుల వా రికి అదేశాలు ఇచ్చామన్నారు. ఆటోలు తిరగవు కాబట్టి ఎవరికైనా అత్యవసర పరిస్థితులు ఎదురైతే 100కు డయల్‌ చేసి సమాచారం ఇవ్వవచ్చునన్నారు. కరోనాను ఎదుర్కొనే విషయంలో ప్రజలు పోలీసు వారి కి అన్నివిధాల సహకారం అందించాలన్నారు. కాగా ఎస్‌పీ వెంట డీఎస్పీ సుధాకర్‌ లోసారి, ట్రైనీ డీఎస్పీ శ్రీపాదరావు, సీఐలు ఉన్నారు.

Read more