బాలుడికి ఆర్థిక సాయం

ABN , First Publish Date - 2020-11-20T04:58:18+05:30 IST

సిద్దవటం మండలం మాధవరం గ్రామానికి చెందిన ‘మన ఊరి కోసం స్వచ్ఛంద సంస్థ’ ఆధ్వర్యంలో కరెంటు షాకుకు గురైన ఐదేళ్ల బాలుడికి రూ.18వేల ఆర్థి సాయం అందించారు.

బాలుడికి ఆర్థిక సాయం
ఆర్థిక సాయం అందిస్తున్న స్వచ్ఛంద సంస్థ చైర్మన్‌ రవిశంకర్‌

సిద్దవటం, నవంబరు19 : సిద్దవటం మండలం మాధవరం గ్రామానికి చెందిన ‘మన ఊరి కోసం స్వచ్ఛంద సంస్థ’ ఆధ్వర్యంలో కరెంటు షాకుకు గురైన ఐదేళ్ల బాలుడికి రూ.18వేల ఆర్థి సాయం అందించారు.  చక్రాయపేట మండలం నాగులపుట్టపల్లెకు చెందిన బాలుడు రామ్‌చరణ్‌ గ్రామంలో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌ తగిలి కాలు, చెయ్యి కోల్పోవడంతో అతని తల్లిదండ్రులు ఈ విషయాన్ని సోషల్‌మీడియాలో అప్‌లోడ్‌ చేశారు. విషయం తెలుసుకున్న సిద్దవటం మండలం మాధవరం ‘మన ఊరి కోసం స్వచ్ఛంద సంస్థ’ ప్రతినిధులు గురువారం ఆ బాలునికి రూ.18వేల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థ చైర్మన్‌ రవిశంకర్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సాయం అందించి ఆదుకోవాలని కోరారు. శివానంద, సుధీర్‌, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-20T04:58:18+05:30 IST