బ్రిటన భయం

ABN , First Publish Date - 2020-12-27T05:36:59+05:30 IST

బ్రిటనను కొత్త రకం స్ర్టెయిన వైరస్‌ కుదిపేస్తోంది. కరోనా నుంచి కుదుటపడిన బ్రిటనకు స్ర్టెయిన షాక్‌ ఇస్తోంది. అక్కడ వైరస్‌ శరవేగంగా వ్యాపిస్తుండడంతో బ్రిటనను కలవరపరుస్తోంది. అయితే ఇప్పుడు బ్రిటన నుంచి 23 మంది జిల్లాకు చేరుకోవడంతో ఇప్పుడు జిల్లాలో బ్రిటన భయం పట్టుకుంది.

బ్రిటన భయం

జిల్లాకు 23 మంది వచ్చినట్లుగా గుర్తింపు

9 మంది చిరునామా గుర్తింపు.. నమూనాల సేకరణ

ఐదుగురికి నెగెటివ్‌

నలుగురి రిపోర్టు కోసం వెయిటింగ్‌

కడప, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): బ్రిటనను కొత్త రకం స్ర్టెయిన వైరస్‌ కుదిపేస్తోంది. కరోనా నుంచి కుదుటపడిన బ్రిటనకు స్ర్టెయిన షాక్‌ ఇస్తోంది. అక్కడ వైరస్‌ శరవేగంగా వ్యాపిస్తుండడంతో బ్రిటనను కలవరపరుస్తోంది. అయితే ఇప్పుడు బ్రిటన నుంచి 23 మంది జిల్లాకు చేరుకోవడంతో ఇప్పుడు జిల్లాలో బ్రిటన భయం పట్టుకుంది. గత నెల 23 నుంచి మొన్నటి వరకూ బ్రిటన నుంచి జిల్లాకు 23 మంది వచ్చినట్లు నిర్ధారించారు. వీరిలో 9 మంది చిరునామా గుర్తించారు. కడపలో ఐదు, చెన్నూరులో ఒకరు, ప్రొద్దుటూరులో ముగ్గురుగా గుర్తించి వారిని హోం క్వారంటైనలో ఉంచారు. కాగా ఆ 9 మంది నమూనాలు ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలకు పంపగా ఐదు మందికి నెగెటివ్‌ వచ్చింది. మరో నలుగురి శాంపిల్స్‌ రిజల్ట్స్‌ రావాల్సి ఉంది. 


మిగతా వారి జాడ ఎక్కడ?

బ్రిటన నుంచి 23 మందిలో 9 మంది జిల్లాకు రాగా మిగతా 14 మంది ఆచూకీ కోసం వైద్య ఆరోగ్యశాఖ ప్రయత్నాలు చేసింది. వీరిలో కొందరు హైదరాబాదు, హుబ్లి, తిరుపతి, బెంగుళూరులో ఉన్నట్లు గుర్తించింది. అక్కడి అధికారులకు వారిని హోం క్వారంటైనకు సూచించి పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సూచించింది. ఒకరు తిరిగి బ్రిటనకు వెళ్లినట్లు వైద్య ఆరోగ్యశాఖ నిర్ధారించింది. 


స్ర్టెయిన భయం

కరోనా మహమ్మారి నుంచి జిల్లావాసులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. కేసుల సంఖ్య తగ్గిపోయింది. ఒకప్పుడు రోజుకు వెయ్యి దాకా నమోదయ్యేవి. ఇప్పుడు వాటి సంఖ్య 30లోపు పడిపోయింది. కరోనా తగ్గిపోవడంతో జనం ఊపిరి పీల్చుకుని ఎవరి పనుల్లో వారు నిమగ్నమవుతున్నారు. వ్యాపార సంస్థలు ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నాయి. ఈ తరుణంలో బ్రిటనలో కొత్త రకం స్ర్టెయిన వైరస్‌ ఉన్నట్లు వార్తలు రావడంతో జనాన్ని ఒక్కసారిగా ఆలోచింపజేసింది. చైనాలో గత ఏడాది డిసెంబరులో కరోనా కుదిపేస్తుంటే ఆ దేశం నుంచి మన దగ్గరికి కరోనా రాదులే అనే ధీమా జనాల్లో ఉండేది. అయితే నాలుగు నెలల్లోనే సీన మారింది. ఏప్రిల్‌ 1న జిల్లాలో కరోనా తొలి కేసులు నమోదయ్యాయి. చాపకింద నీరులా జిల్లా మొత్తం చుట్టేసింది.. పల్లె పట్నం అని కాకుండా అన్ని చోట్లకు విస్తరించింది. ఇప్పటి వరకు 55,083 కేసులు నమోదు కాగా 530 మంది మృతి చెందారు. కొత్త రకం స్ర్టెయిన కూడా ఎక్కడ వ్యాప్తి చెందుతుందోనన్న భయం జనాల్లో ఉంది.


మరో 15 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

జిల్లాలో 24 గంటల వ్యవధిలో మరో 15 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ శనివారం వెల్లడించింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 55,083కు చేరుకుంది. మరొకరు మృతి చెందారు. ఇప్పటి వరకు 530 మందిని కరోనా కాటేసింది. కొవిడ్‌ ఆసుపత్రిలో కోలుకున్న 34 మందిని డిశ్చార్జి చేశారు. 54,481 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 101 మంది హోంఐసోలేషనలో చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2020-12-27T05:36:59+05:30 IST