జిల్లా కోవిడ్‌ హాస్పిటల్‌గా ఫాతిమా కళాశాల

ABN , First Publish Date - 2020-03-29T10:17:06+05:30 IST

జిల్లా కోవిడ్‌ హాస్పిటల్‌గా ఫాతిమా మెడికల్‌ కళాశాల (ఫిమ్స్‌)ను ఎంపిక చేయడం జరిగిందని కలెక్టరు హరికిరణ్‌

జిల్లా కోవిడ్‌ హాస్పిటల్‌గా ఫాతిమా కళాశాల

కలెక్టర్‌ హరికిరణ్‌


కడప (సెవెన్‌రోడ్స్‌), మార్చి 28: జిల్లా కోవిడ్‌ హాస్పిటల్‌గా ఫాతిమా మెడికల్‌ కళాశాల (ఫిమ్స్‌)ను ఎంపిక చేయడం జరిగిందని కలెక్టరు హరికిరణ్‌ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం నగర శివార్లలో ఉన్న జిల్లా సర్వజన వైద్యశాల (రిమ్స్‌)లో ఉన్న కరోనా (కోవిడ్‌-19) ప్రత్యేక బ్లాకులను, ఐసోలేషన్‌ వార్డులను, త్రోట్‌ స్వాబ్‌ శాంపిల్స్‌ సేకరణ గదులు, సంబంధిత వైద్య పరికరాలను త్వరలోనే కడప సమీపంలో పులివెందుల రోడ్డులో ఉన్న ఫాతిమా మెడికల్‌ కళాశాలకు తరలించడం జరుగుతుందన్నారు.


అందుకు సంబంధించిన వైద్య సిబ్బంది, పారా మెడికల్‌, నర్శింగ్‌ సిబ్బంది కూడా ఇక మీదట కోవిడ్‌ జిల్లా ఆసుపత్రిగా మార్పు చేసిన ఫాతిమా మెడికల్‌ కళాశాలలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. అత్యంత క్రిటికల్‌ వైద్య సేవల కోసం రాష్ట్ర స్థాయి కోవిడ్‌ వైద్యశాలలైన తిరుపతిలోని పద్మావతి మెడికల్‌ కళాశాల, నెల్లూరులోని ప్రభుత్వ ఆసుపత్రి, విజయవాడలోని సిద్దార్థ మెడికల్‌ కళాశాల, విశాఖపట్టణం, కాకినాడలలో ఎంపిక చేసిన కోవిడ్‌ ఆసుపత్రుల్లో వైద్యం అందుతుందని కలెక్టరు ఆ ప్రకటనలో తెలిపారు.

Updated Date - 2020-03-29T10:17:06+05:30 IST