-
-
Home » Andhra Pradesh » Kadapa » Farmers need to be confident
-
రైతులు ఆత్మస్థైర్యంతో ఉండాలి
ABN , First Publish Date - 2020-12-29T05:23:04+05:30 IST
నష్టపోయా మని, గిట్టుబాటు ధరలు లేవని భయపడకుండా రైతు లు ఆత్మహత్యలకు పాల్పడ కుండా ధైర్యంగా ఉండాలని, అలాంటి వారందరికీ టీడీపీ అండగా ఉంటుందని కడప పార్లమెం టు టీడీపీ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి తెలిపారు.

టీడీపీ కడప పార్లమెంటరీ అధ్యక్షుడు లింగారెడ్డి
జమ్మలమడుగు రూరల్, డిసెం బరు 28: నష్టపోయా మని, గిట్టుబాటు ధరలు లేవని భయపడకుండా రైతు లు ఆత్మహత్యలకు పాల్పడ కుండా ధైర్యంగా ఉండాలని, అలాంటి వారందరికీ టీడీపీ అండగా ఉంటుందని కడప పార్లమెం టు టీడీపీ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి తెలిపారు. సోమ వారం సాయంత్రం జమ్మల మడుగు మండలంలోని పూర్వపు బొమ్మేపల్లె గ్రామంలో ఆత్మహత్యకు పాల్పడిన బాధిత రైతు కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడారు. ముందుగా ఆయన పొన్నతోట గ్రామాన్ని సందర్శించి అక్కడి నుంచి బొమ్మేపల్లె గ్రామంలో రైతు కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ సంవత్సరం క్రితం వ్యవసాయంలో నష్టం వచ్చి ముర్రా బాలనారాయణరెడ్డి అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. జిల్లాలో సుమారు 75 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. రైతన్నలకు గత ప్రభుత్వం రూ.5 లక్షలు ఇచ్చి అప్పులు 1.50 లక్షలు, మిగతా రూ.3.50 లక్షలు బాధిత కుటుంబానికి చెందేదన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభు త్వం రూ7.50 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించినా ఆ డబ్బులను అప్పుల వారు తన్నుకుని పోతున్నారన్నారు. రైతులకు టీడీపీ అండగా ఉంటుందని, వారి సమస్యలు పరిష్క రించేవరకు పోరాటం చేస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మల్లికార్జున, శ్రీనివాసులు పాల్గొన్నారు.