ట్రాక్టర్ ప్రమాదంలో రైతు మృతి
ABN , First Publish Date - 2020-03-08T10:20:58+05:30 IST
మండల పరిధిలోని పెద్దభాకరాపురంలో వ్యవసాయ పనులు చేస్తున్న రైతు ముక్కుమల్ల వెంకటేశ్వరరెడ్డి (44) ప్రమాదవశాత్తు

దువ్వూరు, మార్చి 7: మండల పరిధిలోని పెద్దభాకరాపురంలో వ్యవసాయ పనులు చేస్తున్న రైతు ముక్కుమల్ల వెంకటేశ్వరరెడ్డి (44) ప్రమాదవశాత్తు ట్రాక్టర్ ఢీకొని మృతిచెందాడు. శనివారం పొలంలో పనులు చేస్తుండగా.. వాలుగా ఉండడంతో ఆగివున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు ముందుకు కదలింది. రైతును ఢీకొనడంతో ట్రాక్టర్‌తో పాటు బావిలో పడ్డాడు. గాయపడిన వెంకటేశ్వరరెడ్డిని చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కేసు దర్యాప్తులో ఉంది.