-
-
Home » Andhra Pradesh » Kadapa » Farmer commits suicide due to debt
-
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-03-13T10:29:41+05:30 IST
మండలంలోని దౌలతాపురం గ్రామానికి చెందిన గజ్జల వెంకటరమణారెడ్డి (50) అనే రైతు అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్నాడు.

సీకేదిన్నె, మార్చి 12 : మండలంలోని దౌలతాపురం గ్రామానికి చెందిన గజ్జల వెంకటరమణారెడ్డి (50) అనే రైతు అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకట రమణారెడ్డి ఐదు ఎకరాలు గుత్తకు తీసుకుని అరటి, మిరప, వంగ సాగు చేసి నష్టపోయాడు. దాదాపు రూ.10 లక్షలు అప్పులు కావడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీకేదిన్నె ఎస్‌ఐ తెలిపారు. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. రైతు ఆత్మహత్య విషయం తెలిసిన వ్యవసాయ, రెవెన్యూ అధికారులు గ్రామానికి చేరుకు న్నారు. రైతు మృతదేహాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసు కున్నారు.