అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-07-10T10:34:38+05:30 IST

కడప జిల్లా వీరపునాయునిపల్లె మండలంలోని బసిరెడ్డిపల్లెకు చెందిన రైతు కంభం రమే్‌షరెడ్డి (37) అప్పులబాధతో ఆత్మహత్య

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

వీరపునాయునిపల్లె, జూలై 9: కడప జిల్లా వీరపునాయునిపల్లె మండలంలోని బసిరెడ్డిపల్లెకు చెందిన రైతు కంభం రమే్‌షరెడ్డి (37) అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయనకు ఆరెకరాల పొలం ఉంది. ఇందులో సాగుకోసం అప్పులు చేశాడు. ఇవి వడ్డీ మొదలు కలుపుకుని సుమారు రూ.6లక్షలకు చేరాయి. అప్పుల తీర్చే మార్గం కనిపించకపోవడంతో రమేష్‌రెడ్డి బుధవారం ఉదయం తన పొలంలోకి వెళ్లి పంటల్లో పురుగునివారణకు వాడే గుళికలను మింగి అక్కడే పడుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బంధువులు పొలం వద్దకెళ్లి అపస్మారక స్థితిలో ఉన్న రైతును చికిత్స కోసం 108 వాహనంలో వేంపల్లెకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు రమే్‌షరెడ్డి మృతిచెందినట్లు ధ్రువీకరించారు. మృతుడి తండ్రి రామిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2020-07-10T10:34:38+05:30 IST