‘రైతులపై ఆయుధాలు ప్రయోగించడం సిగ్గు చేటు’

ABN , First Publish Date - 2020-12-01T05:53:05+05:30 IST

దేశానికి అన్నంపెట్టే రైతన్నలపై ఢిల్లీలో పోలీసు లు ఆయుధాలు ప్రయోగించడం సిగ్గుచేటని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చంద్రశేఖర్‌, ఏరియా కార్యవర్గ సభ్యుడు వీరశేఖర్‌ అన్నారు.

‘రైతులపై ఆయుధాలు ప్రయోగించడం సిగ్గు చేటు’
సమావేశంలో మాట్లాడుతున్న సీపీఐ నాయకులు

బద్వేలు, నవంబరు 30: దేశానికి అన్నంపెట్టే రైతన్నలపై ఢిల్లీలో పోలీసు లు ఆయుధాలు ప్రయోగించడం సిగ్గుచేటని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చంద్రశేఖర్‌, ఏరియా కార్యవర్గ సభ్యుడు వీరశేఖర్‌ అన్నారు. సోమవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన సమా వేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్న రైతులపై దారుణంగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. రైతులకు న్యాయం చేయకపోతే ఉద్యమం తీవ్రరూపం దాలుస్తుందన్నారు.

Updated Date - 2020-12-01T05:53:05+05:30 IST