ప్రతి పేద కుటుంబానికి రూ. 5వేలు ఇవ్వాలి

ABN , First Publish Date - 2020-04-26T09:13:18+05:30 IST

కరోనా విపత్తు కింద ప్రతి పేద కుటుంబానికి రూ. 5 వేలు ఇవ్వాలని రైల్వేకోడూరు టీడీపీ ఇన్‌ఛార్జ్‌ కస్తూరి విశ్వనాధనాయుడు డిమాండు

ప్రతి పేద కుటుంబానికి రూ. 5వేలు ఇవ్వాలి

టీడీపీ ఇన్‌ఛార్జ్‌ కస్తూరి విశ్వనాధనాయుడు  


రైల్వేకోడూరు, ఏప్రిల్‌, 25: కరోనా విపత్తు కింద ప్రతి పేద కుటుంబానికి రూ. 5 వేలు ఇవ్వాలని రైల్వేకోడూరు టీడీపీ ఇన్‌ఛార్జ్‌ కస్తూరి విశ్వనాధనాయుడు డిమాండు చేశారు. శనివారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు చంద్రబాబునాయుడు ఆదేశాల ప్రకారం నిరాహార దీక్ష నిర్వహించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూసేసిన క్యాంటీన్లు తెరిపించాలని, చంద్రన్న బీమా పథకాన్ని పునరుద్ధరించాలని, ధాన్యం, పత్తి, మిర్చి, అరటి, మామిడి పండ్ల తోటల ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు. సిరీకల్చర్‌ ఆక్వా పౌలీ్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు కట్టా శ్రీను, చిట్వేలి మండల పార్టీ అధ్యక్షుడు కేకే చౌదరి, రైల్వేకోడూరు మండల పార్టీ అధ్యక్షులు దాసర్రాజు కిరణ్‌కుమార్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-04-26T09:13:18+05:30 IST