ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

ABN , First Publish Date - 2020-12-07T04:47:20+05:30 IST

ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తద్వారా వాటి పరిష్కారానికి అహర్నిశలు శ్రమిస్తున్నామని ఏపీ పంచాయతీరాజ్‌ మినిస్టీరియల్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.నాగిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు లంకా మల్వేశ్వరరెడ్డిలు పేర్కొన్నారు.

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

ఏపీపీఆర్‌ఎంఈఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి

కడప(రూరల్‌), డిసెంబరు 6: ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తద్వారా వాటి పరిష్కారానికి అహర్నిశలు శ్రమిస్తున్నామని ఏపీ పంచాయతీరాజ్‌ మినిస్టీరియల్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.నాగిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు లంకా మల్వేశ్వరరెడ్డిలు పేర్కొన్నారు. ఆదివారం జడ్పీలోని డీపీఆర్‌సీ భవనంలో ఏపీపీఆర్‌ఎంఈఏ మొదటి జిల్లా కార్యవర్గ సమావేశం లంకా మల్వేశ్వరరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగులకు ఇబ్బందికరంగా ఉన్న సీపీఎ్‌సను రద్దు చేయాలనే డిమాండ్‌ను తాము బలంగా వినిపిస్తున్నామని, జిల్లా ప్రజాపరిషత్‌శాఖ పరిధిలో పనిచేసే రికార్డు అసిస్టెంట్లను అప్‌గ్రేడ్‌ చేయాలని పంచాయతీరాజ్‌శాఖకు సూచించామన్నారు. అర్హత ఉన్న అన్ని స్థాయిల ఉద్యోగులకు వెంటనే ప్రమోషన్లను కల్పించేలా కృషి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఏపీపీఆర్‌ఎంఈఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి రాజశేఖర్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి బసిరెడ్డి, తాలూకా యూనిట్ల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర, జిల్లా కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-07T04:47:20+05:30 IST