-
-
Home » Andhra Pradesh » Kadapa » employees in rain
-
విద్యుత మరమ్మతుల కోసం వెళ్లి..
ABN , First Publish Date - 2020-11-27T07:03:01+05:30 IST
విధినిర్వహణలో భాగంగా విద్యుత లైన్ల పునరుద్ధరణ కోసం వెళ్లిని 8మంది విద్యుత శాఖ సిబ్బంది నది రెండుపాయల మధ్య చిక్కుకుపోయారు. అక్కడి నుంచి బయటకు రాలేక గురువారం ఉదయం నుంచి రాత్రి వరకూ సాయంకోసం ఎదురుచూస్తూ ఉండిపోయారు.

నీళ్ల మధ్య చిక్కుకుపోయారు!
ఏఈతో సహా 8మంది విద్యుత శాఖ సిబ్బంది
పొలాల్లో తలదాచుకొని సాయం కోసం ఎదురు చూపులు
రాజంపేట, నవంబరు 26: విధినిర్వహణలో భాగంగా విద్యుత లైన్ల పునరుద్ధరణ కోసం వెళ్లిని 8మంది విద్యుత శాఖ సిబ్బంది నది రెండుపాయల మధ్య చిక్కుకుపోయారు. అక్కడి నుంచి బయటకు రాలేక గురువారం ఉదయం నుంచి రాత్రి వరకూ సాయంకోసం ఎదురుచూస్తూ ఉండిపోయారు. వివరాలిలా..
ఊటుకూరు వద్ద బుధవారం కురిసిన వర్షానికి విద్యుత లైను తెగిపోయింది. దీనిని మరమ్మతులు చేయడానికి విద్యుత శాఖ రాజంపేట రూరల్ ఏఈ షఫీ, లైనఇనస్పెక్టర్లు నాగేశ్వరరావు, హబీబ్, లక్ష్మణరావు, లక్ష్మీపతితోపాటు మొత్తం 8మంది గురువారం ఉదయం వెళ్లారు. పుల్లంగేరు నుంచి వచ్చే భారీ వరదనీరు ఊటుకూరు వద్ద రెండు పాయలుగా చీలి ప్రవహిస్తుంది. ఈ రెండుపాయల మధ్య పొలాల్లో విద్యుతలైన్లు మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా వరదనీరు పెరిగిపోయింది. దీంతో విద్యుత శాఖ సిబ్బంది బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. సాయంత్రం వరకు వీరిని బయటకు తీసుకురావడానికి సంబంధిత అధికారులు చర్యలు తీసుకున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో వారు అక్కడి పొలాల్లో ఉన్న యానాదుల సహాయంతో మాజీ సమితి అధ్యక్షుడు పోలా వెంకటరెడ్డి పొలం షెడ్డు వద్దకు చేరుకున్నారు. అక్కడ విద్యుత్తు కూడా లేదు. దీంతో అర్ధరాత్రి వేళ నీళ్ల మధ్య చిమ్మచీకటిలో గడపాల్సి ఉండటంతో అటు వారు.. ఇటు బంధువులు, అధికారులు ఆందోళన చెందుతున్నారు. అయితే వారున్న ప్రాంతం సురక్షితమని, శుక్రవారం ఉదయమే వారిని బయటకు తీసుకొస్తామని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. కాగా.. ఊటుకూరు సమీపంలోని మరో ప్రాంతంలో పుల్లంగేరు ప్రవహిస్తున్న నదీ పరివాహక ప్రాంతంలో ఓ తోటలో కాపాలా ఉన్న ఆరుగురు వరదనీటిలో చిక్కుకున్నారు. అగ్నిమాపక అధికారులు, రెవెన్యూ అధికారులు గురువారం రాత్రి రెండు బోట్లను తీసుకొచ్చి సాహసోపేతంగా వారిని బయకు తీసుకొచ్చారు. అలాగే, పుల్లంపేట మండలం గుంజననదిని ఆనుకొని ఉన్న చక్రంపేట ప్రాంతంలో ఓ తోటకు కాపలా ఉన్న భార్యభర్తను పెనగలూరు ఎస్‌ఐ చెన్నకేశవులు తాళ్లసాయంతో బయటకు తీసుకువచ్చారు.