-
-
Home » Andhra Pradesh » Kadapa » employ family meeting
-
విద్యుత్ కార్మికుడి కుటుంబానికి అన్ని విధాలా సహాయం
ABN , First Publish Date - 2020-11-26T04:20:35+05:30 IST
విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో మంగళవారం మృతి చెందిన సుబ్రమణ్యం కుటుంబానికి అన్ని విధాలా సహాయం చేస్తామని ట్రాన్స్‌కో ఎస్‌ఈ కోటేశ్వరరావు తెలిపారు.

కొండాపురం, నవంబరు 25: మండలంలోని పాలూరు సబ్‌స్టేషన్‌లో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో మంగళవారం మృతి చెందిన సుబ్రమణ్యం కుటుంబానికి అన్ని విధాలా సహాయం చేస్తామని ట్రాన్స్‌కో ఎస్‌ఈ కోటేశ్వరరావు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులు, యూనియన్ నాయకులతో కలిసి బుధవారం కడపలోని ట్రాన్స్‌కో భవన్‌లో ఆయన చర్చలు జరిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం డ్యూటీలో మృతి చెందిన కుటుంబంలో అర్హతను బట్టి ఉద్యోగాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో 1104 యూనియన్ నాయకులు సుధాకర్‌రెడ్డి, లక్ష్మీకర్‌రెడ్డి, శివారెడ్డి, ఓబులేసు, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.