విద్యుదాఘాతంతో రైతు మృతి

ABN , First Publish Date - 2020-12-06T05:06:29+05:30 IST

పొలంలో పనులు చేస్తుండగా విద్యుత్‌ తీగలు తగలి యువ రైతు మృతి చెందిన సంఘటన శనివారం రాత్రి తిప్పి రెడ్డిపల్లె వద్ద జరిగింది.

విద్యుదాఘాతంతో రైతు మృతి
ఓబులేసు మృతదేహం

మైదుకూరు, డిసెంబరు 5 : పొలంలో పనులు చేస్తుండగా విద్యుత్‌ తీగలు తగలి యువ రైతు మృతి చెందిన సంఘటన శనివారం రాత్రి తిప్పి రెడ్డిపల్లె వద్ద జరిగింది. పోలీసుల కథనం మేరకు... తిప్పిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన అక్కిదాసరి ఓబులేసు (25) పొలంలో పనులు చేసుకుం టుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్‌ తీగలు తగిలి మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు మైదుకూరు పోలీసులు పేర్కొన్నారు. కాగా ఓబులేసుకు భార్య, ఇద్దరు పిల్లలుండగా శుక్రవారం రాత్రి మరో అమ్మాయి పుట్టినట్లు స్థానికులు పేర్కొన్నారు.  


Updated Date - 2020-12-06T05:06:29+05:30 IST