ప్రమాదవశాత్తు విద్యుత తీగ తగిలి యువకుడి మృతి

ABN , First Publish Date - 2020-11-07T05:11:29+05:30 IST

టంగు టూరు గ్రామానికి చెందిన పోతినేని హరిప్రసాద్‌(27) శుక్రవారం పంటపొలంలో ప్రమాదవశాత్తు విద్యుత తీగ తగిలి మృతి చెంది నట్లు ఎస్‌ఐ క్రిష్ణం రాజునాయక్‌ తెలిపారు.

ప్రమాదవశాత్తు విద్యుత తీగ తగిలి యువకుడి మృతి
విద్యుత తీగ తగిలి మృతిచెందిన హరిప్రసాద్‌

రాజుపాలెం, నవంబరు 6: మండల పరిధిలోని టంగు టూరు గ్రామానికి చెందిన పోతినేని హరిప్రసాద్‌(27) శుక్రవారం పంటపొలంలో ప్రమాదవశాత్తు విద్యుత తీగ తగిలి మృతి చెంది నట్లు ఎస్‌ఐ క్రిష్ణం రాజునాయక్‌ తెలిపారు. మృతుని భార్య కుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా.. హరిప్రసాద్‌ ఉదయం 5గంటలకు పంట పొలానికి నీళ్లు కట్టేందుకు వెళ్లి ప్రమా దవశాత్తు విద్యుత తీగ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. మృతునికి భార్య, మూడు, ఒకటిన్నర సంవత్సరాల ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతదేహాన్ని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. కాగా హరిప్రసాద్‌ మృతి చెందిన విషయం తెలిసిన కుటుంబ సభ్యులు ఇక మాకు దిక్కు ఎవరంటూ బోరున విలపించడం అందరిని కలచివేసింది. ప్రతి నిత్యం కూలి పనికి వెళ్లి అంగవైకల్యం ఉన్న తల్లిని, తండ్రిని, భార్య పిల్లలలను పోషించేవాడు. కుటుంబ పోషకుడు మృతితో ఆ కుటుంబం అనాథగా మారింది. ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Updated Date - 2020-11-07T05:11:29+05:30 IST