-
-
Home » Andhra Pradesh » Kadapa » ekiripalli
-
ఏకిరిపల్లెకు రోడ్డు ఏర్పాటు
ABN , First Publish Date - 2020-12-07T04:47:28+05:30 IST
ఏకిరిపల్లె గ్రామానికి రాజంపేట మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాధరెడ్డి సొంత నిధులతో తాత్కాలిక రోడ్డు ఏర్పాటు చేశారు.

రాజంపేట, డిసెంబరు6 : ఏకిరిపల్లె గ్రామానికి రాజంపేట మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాధరెడ్డి సొంత నిధులతో తాత్కాలిక రోడ్డు ఏర్పాటు చేశారు. తుఫాను వల్ల భారీ వరదతో చెయ్యేరు నదీ పరీవాహక ప్రాంతం పొంగిపొర్లడంతో రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. చెయ్యేరు నుంచి ఏకిరిపల్లెకు వెళ్లే రోడ్డు పాడైపోయింది. దీంతో ఆ గ్రామానికి తాత్కాలిక రోడ్డు ఏర్పాటు చేశారు. అంతేకాక వర్షంతో ఇబ్బందులు పడుతున్న వారికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బొల్లినేని రామ్మోహన్‌నాయుడు, భీము సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.