-
-
Home » Andhra Pradesh » Kadapa » dst in traffic
-
ట్రాఫిక్‌కు ఇబ్బంది కల్గించవద్దు : డీఎస్పీ
ABN , First Publish Date - 2020-11-26T04:27:07+05:30 IST
దుకాణాల ముందు ఇష్టానుసారంగా టూవీలర్‌లు పార్కింగ్ చేసి ట్రాఫిక్‌కు ఇబ్బంది కల్గించవద్దని వ్యాపారులకు డీఎస్పీ వై.ప్రసాదరావు తెలిపారు.

ప్రొద్దుటూరు క్రైం, నవంబరు 25 : దుకాణాల ముందు ఇష్టానుసారంగా టూవీలర్‌లు పార్కింగ్ చేసి ట్రాఫిక్‌కు ఇబ్బంది కల్గించవద్దని వ్యాపారులకు డీఎస్పీ వై.ప్రసాదరావు తెలిపారు. బుధవారం మూడో పట్టణ పోలీ్‌సస్టేషన్ పరిధిలో సీఐ సుబ్బారావుతో కలిసి ప్రజలకు ట్రాఫిక్‌పై సూచనలు ఇస్తూ ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డుపైనే మోటారుసైకిల్ పార్కింగ్ చేసి ఉండటం, తోపుడు బండ్లు ఉండటాన్ని డీఎస్పీ గమనించారు. రాజీవ్ సర్కిల్, టీబీ రోడ్డు, జమ్మలమడుగు రోడ్డులోని వ్యాపార సముదాయాలను పరిశీలించి, అక్కడి వ్యాపారులకు పలు సూచనలు చేశారు. రోడ్లపై అడ్డదిడ్డంగా పార్కింగ్ చేస్తే, జరిమానాలు విధించక తప్పదని హెచ్చరించారు. పోలీసు సూచనలు పాటిస్తూ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు సహకరించాలని డీఎస్పీ ప్రజలను కోరారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది ఉన్నారు.