భయపడొద్దు.. ధైర్యంగా ఉండండి

ABN , First Publish Date - 2020-11-28T05:27:31+05:30 IST

గత మూడురోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయని, వారందరినీ పోలీసు శాఖతో పాటు ఫైర్‌ శాఖ, రెవెన్యూ ఆధ్వర్యంలో అందరినీ సురక్షితంగా రక్షిస్తున్నామని, ఎవరూ భయపడొద్దని, ధైర్యంగా ఉండాలని, కడప డీఎస్పీ సునీల్‌ పేర్కొన్నారు.

భయపడొద్దు.. ధైర్యంగా ఉండండి

కడప డీఎస్పీ సునీల్‌

కడప(క్రైం), నవంబరు 27: గత మూడురోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయని, వారందరినీ పోలీసు శాఖతో పాటు ఫైర్‌ శాఖ, రెవెన్యూ ఆధ్వర్యంలో అందరినీ సురక్షితంగా రక్షిస్తున్నామని, ఎవరూ భయపడొద్దని, ధైర్యంగా ఉండాలని, కడప డీఎస్పీ సునీల్‌ పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి నగరంలోని లోతట్టు ప్రాంతాలను సీఐ, ఎస్‌ఐలు, సిబ్బందితో కలిసి కవాతు నిర్వహించారు. కార్యక్రమంలో సీఐలు నాగభూషణం, సత్యనారాయణ, అశోక్‌రెడ్డి, మహ్మద్‌ ఆలీ, సత్యబాబు, శ్రీధర్‌నాయుడు ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

Read more