బావి నీటితోనే దద్దుర్లు

ABN , First Publish Date - 2020-12-31T05:09:49+05:30 IST

మండలంలోని మోట్నూతలపల్లెలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అనిల్‌కుమార్‌ బుధవారం పర్యటించారు.

బావి నీటితోనే దద్దుర్లు
బావి నీటిని పరిశీలిస్తున్న డీఎంహెచ్‌వో

డీఎంహెచ్‌వో అనిల్‌కుమార్‌


పులివెందుల రూరల్‌, డిసెంబరు 30: మండలంలోని మోట్నూతలపల్లెలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అనిల్‌కుమార్‌ బుధవారం పర్యటించారు. గ్రామంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న వైద్యశిబిరాన్ని ఆయన పరిశీలించారు. గ్రామ ప్రజల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఉపయోగించే బావి నీరు కలుషితమైందని అందువల్ల దద్దుర్లు, గజ్జి, తామర వంటి వ్యాధులు వస్తున్నాయని ప్రజలకు తెలియజేశారు. అలాగే ట్యాంకులను శుభ్రం చేయించామని, వేడి నీటిని మాత్రమే తాగాలని, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు. అనంతరం పులివెందుల పట్టణంలోని నగరిగుట్ట అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ను పరిశీలించి రోగుల వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారిణి శరణ్య, చర్మ వ్యాధి నిపుణులు నరోత్తమరెడ్డి, సంతకొవ్వూరు వైద్యాధికారి పవన్‌, గణాంకాల అధికారులు జార్జ్‌, ఓబులరెడ్డి, సతీ్‌షకుమార్‌, ఆరోగ్య, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-31T05:09:49+05:30 IST