పుష్పగిరి బ్యారేజీ డీపీఆర్‌ పనులు ప్రారంభం

ABN , First Publish Date - 2020-11-22T04:31:47+05:30 IST

మండల పరిధిలోని ఆదినిమ్మాయపల్లె ఆనకట్టకు దిగువన పుష్పగిరి ఆలయ సమీపంలో పెన్నానదిపై పుష్పగిరి బ్యారేజీకి సం బంధించిన డీపీఆర్‌ పనులను శనివారం ఎమ్మెల్యే రవీంద్రనాధరెడ్డి, కమలా పురం వైసీపీ సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లిఖార్జునరెడ్డితో కలిసి పరిశీలిం చారు.

పుష్పగిరి బ్యారేజీ డీపీఆర్‌ పనులు ప్రారంభం

వల్లూరు, నవంబరు 21 :మండల పరిధిలోని ఆదినిమ్మాయపల్లె ఆనకట్టకు దిగువన పుష్పగిరి ఆలయ సమీపంలో పెన్నానదిపై పుష్పగిరి బ్యారేజీకి సం బంధించిన డీపీఆర్‌ పనులను శనివారం ఎమ్మెల్యే రవీంద్రనాధరెడ్డి, కమలా పురం వైసీపీ సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లిఖార్జునరెడ్డితో కలిసి పరిశీలిం చారు. ఈ సందర్భంగా వారు ఇంజనీర్ల ద్వారా అవసరమైన వివరాలు సేకరి ంచారు. అలాగే డ్రిల్లింగ్‌ పనులను పరిశీలించారు. ఇంజనీరింగ్‌, జియాలజీ అధికారులతో డీపీఆర్‌ తయారీ గురించి చర్చించారు. కేసీ కెనాల్‌ చివరి ఆయకట్టు వరకు నీరందేలా చూస్తామన్నారు. దీంతో వల్లూరు, ఖాజీపేట మండలాల రైతులకు ఉపయోగం ఉంటుందన్నారు. వీరి వెంట కేసీ కెనాల్‌ ఈఈ ప్రతాప్‌, డీఈ బ్రహ్మానందరెడ్డి, ఏఈలు దీపక్‌, మురళి, శంకర్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

Read more