అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి

ABN , First Publish Date - 2020-12-06T05:02:55+05:30 IST

వేంపల్లె రాజీవ్‌కాలనీకి చెందిన నాగేంద్ర(23) అను మానాస్పదస్థితిలో మృతిచెందినట్లు ఎస్‌ఐ తిరుపాల్‌నాయక్‌ తెలిపారు.

అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి
మృతుడు నాగేంద్ర

వేంపల్లె, డిసెంబరు 5: వేంపల్లె రాజీవ్‌కాలనీకి చెందిన నాగేంద్ర(23) అను మానాస్పదస్థితిలో మృతిచెందినట్లు ఎస్‌ఐ తిరుపాల్‌నాయక్‌ తెలిపారు. ఎస్‌ఐ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాజీవ్‌కాలనీకి చెందిన నా గేంద్ర అనే యువకుడు రాయచోటి-వేంపల్లె పెట్రోల్‌ బంకు వెనుకవైపున మృతిచెంది ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచా రం అందించారు. నాగేంద్ర కనిపించడం లేదంటూ రెండు రోజుల క్రితం కుటుంబ సభ్యులు వేంపల్లె పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా ఆ యువకుడి మృతదేహం వద్ద పురుగుల మందు డబ్బా ఉండటాన్ని బట్టి ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్‌ఐ తెలిపారు. అయితే ముఖంపై గాయాలు ఉండటంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

Updated Date - 2020-12-06T05:02:55+05:30 IST