రూ.17 లక్షల విరాళం

ABN , First Publish Date - 2020-04-04T09:23:04+05:30 IST

కరోనా మహమ్మారితో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తమవంతు సాయంగా పలువురు దాతలు ముందుకొస్తున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇబ్బందులు పడే వారికి

రూ.17 లక్షల విరాళం

రాయచోటిటౌన్‌, ఏప్రిల్‌ 3: కరోనా మహమ్మారితో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తమవంతు సాయంగా పలువురు దాతలు ముందుకొస్తున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇబ్బందులు పడే వారికి భోజన వసతులు కల్పించడంతో పాటు పారిశుధ్య చర్యలు, వైద్య సహాయం కోసం ఈ విరాళాలను ఖర్చు చేయనున్నారు. శుక్రవారం కరోనా చారిటబుల్‌ ట్రస్టుకు విరాళాలు అందించిన దాతల వివరాలు ఇలా ఉన్నాయి.


ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి రూ.లక్ష, రామాపురం క్రషర్‌ మిషన్స్‌ వారు రూ.5 లక్షలు, గ్రేటర్‌ హైదరాబాద్‌ అసోషియేషన్‌ ఆధ్వర్యంలో చింతం వెంకటరెడ్డి రూ.లక్ష, పప్పిరెడ్డి మహేశ్వర్‌రెడ్డి రూ.50 వేలు, తహసీల్దార్‌ సుబ్రమణ్యంరెడ్డి రూ.10 వేలు, ఎంపీడీవో అయ్యన్న రూ.10 వేలు, ప్రముఖ చిన్నపిల్లల వైద్యుడు బయారెడ్డి రూ.50 వేలు, రవితేజ హాస్పిటల్‌ డాక్టర్‌ రత్నం రూ.60 వేలు, వైసీపీ నాయకులు కోడి శ్రీనివాసులరెడ్డి రూ.90 వేలు, గౌస్‌ఖాన్‌ రూ.10 వేలు, ఇర్షాద్‌ రూ.10 వేలు, అఫ్జల్‌అలీఖాన్‌ బ్రదర్స్‌ రూ.50 వేలు, జిన్నా సేవా ట్రస్టు అధ్యక్షుడు షరీఫ్‌  రూ.90 వేలు, ఎం.వెంకట్రామిరెడ్డి రూ.50 వేలు, అబీబుల్లాఖాన్‌ రూ.50 వేలు, కాంట్రాక్టర్‌ రియాజ్‌ రూ.30 వేలు, మాజీ కౌన్సిలర్‌ ఫయాజ్‌ రూ.30 వేలు, సాదిక్‌అలీ రూ.30 వేలు, రియాజుర్‌ రెహమాన్‌ రూ.30 వేలు, మార్కెట్‌  కమిటీ చైర్మన్‌ చెన్నూరు అన్వర్‌బాషా రూ.25 వేలు, దారుల్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ రూ.10 వేలు, మైనార్టీ నేత బషీర్‌ఖాన్‌ రూ.50 వేలు, సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రెడ్డి రూ.50 వేలు, షిరిడీ సాయి ఆలయ సేవా సమితి రూ.30 వేలు, ప్రైవేటు స్కూల్స్‌ అసోసియేషన్‌ రూ.40 వేలు, ఇబ్రహీం రూ.7,250 చొప్పున సుమారు రూ.17 లక్షల వరకు అందజేశారు. 

Updated Date - 2020-04-04T09:23:04+05:30 IST