కరోనా వేగానికి కళ్లెం పడేనా ?

ABN , First Publish Date - 2020-09-13T08:15:42+05:30 IST

జిల్లాలో కరోనా కలవరపెడుతోంది. పట్టుపగ్గాలేకుండా వేగంగా విస్తరిస్తోంది. కరోనా మహమ్మారికి కళ్లెం పడేదెన్నడు. భయం లేకుండా సాధారణ జీవనం సాగించేదేన్నడు అంటూ ప్రజలు అందోళన

కరోనా వేగానికి కళ్లెం పడేనా ?

  • శనివారం ఒక్కరోజే 792 పాజిటివ్‌ కేసులు
  • 9 మంది మృత్యువాత
  • కలవరపెడుతున్న మహమ్మారి


కడప, సెప్టెంబరు 12 (ఆంద్రజ్యోతి): జిల్లాలో కరోనా కలవరపెడుతోంది. పట్టుపగ్గాలేకుండా వేగంగా విస్తరిస్తోంది. కరోనా మహమ్మారికి కళ్లెం పడేదెన్నడు. భయం లేకుండా సాధారణ జీవనం సాగించేదేన్నడు అంటూ ప్రజలు అందోళన చెందుతున్నారు. శనివారం ఒక్కరోజే 792 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు బాధితుల సంఖ్య 36,071కి చేరింది. శనివారం 9 మంది మృత్యువాత పడ్డారు. కరోనా మృతుల సంఖ్య 371కి చేరింది. కరోనాతో చికిత్స పొందుతూ 1331 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనా బారిన పడి 5427 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జిల్లాలో శనివారం 6138 నుంచి కరోనా టెస్టింగ్‌ శాంపిల్స్‌ సేకరించారు. 

Updated Date - 2020-09-13T08:15:42+05:30 IST