కూరగాయల కోసం గుంపులు గుంపులుగా రావద్దు
ABN , First Publish Date - 2020-04-05T09:13:02+05:30 IST
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలు కూరగాయలు కొనేందుకు గుంపులు గుంపులుగా రావద్దని కమిషనర్

కడప, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలు కూరగాయలు కొనేందుకు గుంపులు గుంపులుగా రావద్దని కమిషనర్ లవన్న సూచించారు. శనివారం సాయంత్రం ఆయన ఛాంబరులో విలేకరులతో మా ట్లాడారు. లాక్డౌన్ను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు గా ను ప్రభుత్వం అన్ని రకాల చర్య లు తీసుకుంటుందన్నారు. నిత్యావసరాలు, కూరగాయల కోసం ప్రతి డివిజన్లో దుకాణాలను ఏర్పాటు చేశామన్నారు. అలాగే ప్రతి డివిజ న్కు కూరగాయలు 80 తోపుడుబండ్ల ద్వారా పంపిస్తామన్నారు. ప్రజలంతా ఆ ప్రాంతాల్లోనే భౌతిక దూరాన్ని పాటిస్తూ కొనుగోలు చేయాలన్నారు. పారిశుధ్య చర్యలు వేగవంతం చేశామన్నారు. తాగునీటి సమస్య తలెత్తితే ఆయా ప్రాంతాల అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు.