-
-
Home » Andhra Pradesh » Kadapa » Do justice to Urdu students
-
ఉర్దూ విద్యార్థులకు న్యాయం చేయండి
ABN , First Publish Date - 2020-12-28T05:21:14+05:30 IST
నెల్లూరు జిల్లాలో 9 ఉర్దూ ప్రాఽథమికోన్నత పాఠశాలల్లో తెలుగు మీడియం ఫిజికల్ సైన్స్ పోస్టులను బదిలీల్లో చూపారని, దీంతో ఉర్దూ విద్యార్థులకు తీరని నష్టం జరుగుతుందని తక్షణం న్యాయం చేయాలని రూటా రాష్ట్ర ప్రధాన కర్యాదర్శి సయ్యద్ ఇక్బాల్ డిమాండ్ చేశారు.

కడప (ఎడ్యుకేషన్), డిసెంబరు 27 : నెల్లూరు జిల్లాలో 9 ఉర్దూ ప్రాఽథమికోన్నత పాఠశాలల్లో తెలుగు మీడియం ఫిజికల్ సైన్స్ పోస్టులను బదిలీల్లో చూపారని, దీంతో ఉర్దూ విద్యార్థులకు తీరని నష్టం జరుగుతుందని తక్షణం న్యాయం చేయాలని రూటా రాష్ట్ర ప్రధాన కర్యాదర్శి సయ్యద్ ఇక్బాల్ డిమాండ్ చేశారు. కడప డిప్యూటీ సీఎం నివాసంలో ఆదివారం డిప్యూటీ సీఎంను కలిసి వినతిపత్రం అందించారు. ఇందుకు ఆయన స్పందించి విద్యాశాఖ మంత్రితో ఫోనులో మాట్లాడి సమస్య పరిష్కరించారు. కార్యక్రమంలో రూటా రాష్ట్ర నాయకులు హిదయతుల్లా, మహ్మద్ అయూబ్, జిల్లా నాయకులు అబ్దుల్ హకీం, సయ్యద్ సిరాజుద్దీన్ పాల్గొన్నారు.