ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2020-09-12T11:23:22+05:30 IST

నవశకంలో భాగంగా రేషన్‌ కార్డుదారులకు ఈకేవైసీ ప్రక్రియను సకాలంలో పూర్తి చేసి రైస్‌ కార్డుల పంపిణి వేగవంతం చేయాలని ..

ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి

పొద్దుటూరు అర్బన్‌, సెప్టెంబరు 11: నవశకంలో భాగంగా రేషన్‌ కార్డుదారులకు ఈకేవైసీ ప్రక్రియను సకాలంలో పూర్తి చేసి రైస్‌ కార్డుల పంపిణి వేగవంతం చేయాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ (రెవెన్యూ) గౌతమి అధికారులను ఆదేశించారు.  ప్రొద్దు టూరు  అర్బన్‌, రూరల్‌ పరిధిలోని సచివాలయాల్లో శుక్రవారం సాయంత్రం సిబ్బంది  నిర్వహిస్తున్న ఈకేవైసీ ప్రక్రియను  క్షేత్ర స్థాయి లో జేసీ స్వయంగా  పరిశీలించారు. ఈ సందర్భంగా రికా ర్డులను ఆమె తనిఖీ చేసి రైస్‌ కార్డుల పంపిణీలో ఎక్కడా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా సరిచూసుకోవాలని అధి కారులు, సిబ్బందిని ఆదేశించారు.


కాగా ప్రొద్దుటూరు అర్బన్‌ పరిధిలో 7803 కార్దులకు  గాను 2454 కార్డులను ఫ్రింట్‌ చేసి అందులో 2440 కార్డులను పంపిణి చేయగా రూరల్‌ పరిధిలో 3797 కార్డులకు  1940 కార్డులను రీ ఫ్రింట్‌ చేసి ఇచ్చినట్లు తహసీల్దారు నజీర్‌ అహ్మద్‌ జేసీకి వివరించారు.  జేసీ వెంట మున్సిపల్‌ కమిషనర్‌ రాధ, అసిస్టెంట్‌ కమిషనర్‌ గంగాప్రసాద్‌ డీటీ వరద కిషోర్‌, ఆర్‌ఐ క్రిష్ణారెడ్డి సతీష్‌,సుదర్శన్‌ లున్నారు.


రేషన్‌కార్డులపై జేసీ ఆరా

ప్రొద్దుటూరు రూరల్‌, సెప్టెంబరు 11: మండలంలోని కొత్తపల్లె గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని శుక్రవారం జాయింట్‌ కలెక్టర్‌ గౌతమి ఆకస్మికంగా తనిఖీ చేసి పంచాయతీ పరిధిలో ఎంత మందికి రేషన్‌కార్డులు అందాయి, ఎంత మందికి అందలేదు, అందకపోవడానికి కారణాలపై ఆరా తీశారు. దరఖాసుకున్న ప్రతి ఒక్కరికి తప్పకుండా రేషన్‌కార్డు అందాలని ఆమె సూచించారు. రేషన్‌కార్డుల మంజూరులో వలంటీర్లుకానీ, సచివాలయ సిబ్బంది కానీ అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి పుల్లారెడ్డి, వీఆర్వోలు ఉన్నారు.

Updated Date - 2020-09-12T11:23:22+05:30 IST