ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2020-12-04T04:43:29+05:30 IST

గాయపడ్డ బాలకుళాయప్ప చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి
మృతి చెందిన బాలకుళాయప్ప

పులివెందుల టౌన్‌, డిసెంబరు 3: పట్టణంలోని మార్కెట్‌ యార్డు రింగు రోడ్డు సమీపంలో బుధవారం రాత్రి రెండు బైకులు ఢీకొన్న సంఘటనలో గాయపడ్డ బాలకుళాయప్ప చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.పట్టణంలోని మార్కెట్‌ యార్డు రింగు రోడ్డు సమీపంలో బుధవారం రాత్రి రెండు బైకులు ఢీకొన్న సంఘటనలో గాయపడ్డ బాలకుళాయప్ప చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు పులివెందులకు చెందిన అంకిరెడ్డి బైకులో పులివెందుల నుంచి జేఎన్టీయూ కళాశాల వైపు వస్తూ ఎదురుగా వస్తున్న హరికృష్ణ నడుపుతున్న బైకును ఢీకొట్టడం జరిగిందన్నారు. ఈ ప్రమాదంలో అంకిరెడ్డి నడుపుతున్న బైకులో వెనుక కూర్చున్న తొండూరు మండలం ఇనగలూరు గ్రామానికి చెందిన బాలకుళాయప్ప తలకు రక్తగాయాలయ్యాయన్నారు. వెంటనే రిమ్స్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బాలకుళాయప్ప మృతి చెందినట్లు తెలిపారు. ప్రమాదంలో హరికృష్ణ కుడిమోకాలు వద్ద విరిగినట్లు తెలిపారు. దీనిపై హరికృష్ణ తండ్రి సుబ్బరాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2020-12-04T04:43:29+05:30 IST