-
-
Home » Andhra Pradesh » Kadapa » Develops to OilMillers
-
ఆయిల్ మిల్లర్స్ అభివృద్ధ్దికి కృషి చేస్తా: అంబటి
ABN , First Publish Date - 2020-12-28T05:03:20+05:30 IST
ఆయిల్ మిల్లర్స్ అభివృద్ధ్దికి తన వంతు కృషి చేస్తానని ఏపీ వ్యవసాయశాఖ ము ఖ్య సలహాదారు అంబటి క్రిష్ణారెడ్డి పేర్కొన్నారు.

ప్రొద్దుటూరు క్రైం, డిసెంబరు 27 : ఆయిల్ మిల్లర్స్ అభివృద్ధ్దికి తన వంతు కృషి చేస్తానని ఏపీ వ్యవసాయశాఖ ము ఖ్య సలహాదారు అంబటి క్రిష్ణారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక శ్రీనివాస ఆయిల్ మిల్ ప్రాంగణంలో వైఎస్‌ఆర్ కడపజిల్లా ఆయిల్ మిల్లర్స్ అసోసియేషన్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిఽథిగా అంబటి క్రిష్ణారెడ్డి హాజరై మాట్లాడుతూ ఆయిల్ మిల్లర్స్ సమస్యలు ఏవైనా ఉంటే తన దృష్టికి తీసుకువస్తే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానన్నారు. ఈ సందర్భంలోనే ఆయిల్ మిల్లర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అసోసియేషన్ అధ్యక్షుడిగా అంబటి క్రిష్ణారెడ్డి, గౌరవాధ్యక్షుడిగా వంకధార వీరభద్రయ్య, ఉపాధ్యక్షులుగా శంకరయ్య, సత్యనారాయణ, ఆర్.రామాంజినేయులు, కార్యదర్శిగా ఎస్.రాజశేఖర్, కోశాధికారిగా మార్తల చంద్రఓబు లరెడ్డి, సంయుక్త కార్యదర్శిగా కామిశెట్టి కృష్ణమూర్తిలు ఎన్నికయ్యారు. అంతకు ముం దు ఏపీ వ్యవసాయశాఖ ముఖ్య సలహాదారులు అంబటి క్రిష్ణారెడ్డిని ఆయిల్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు దుశ్శాలువతో ఘ నంగా సత్కరించారు. కార్యక్రమానికి ఆయిల్ మిల్లర్స్ పాల్గొన్నారు.