-
-
Home » Andhra Pradesh » Kadapa » Development
-
అపోహలు వీడి అభివృద్ధికి సహకరించండి
ABN , First Publish Date - 2020-11-22T05:11:52+05:30 IST
వ్యాపారస్తులు జీవనోపాధి కోల్పోతామనే అపో హలు వీడి పట్టణ అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ రాధ పేర్కొన్నా రు.

ప్రొద్దుటూరు, నవంబరు 21 : వ్యాపారస్తులు జీవనోపాధి కోల్పోతామనే అపో హలు వీడి పట్టణ అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ రాధ పేర్కొన్నా రు. శనివారం కమిషనర్ ఛాంబర్‌లో కూరగాయల మార్కెట్ వ్యాపారులతో సమావేశమై ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం మార్కె ట్ అధునీకీకరణకు చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో భాగంగానే చిరు వ్యాపారులు కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా వ్యవసాయ మార్కెట్ యార్డులో తాత్కాలికంగా నిర్మాణ పనులు చేపడుతున్నామన్నారు. నంద్యాల, చీరాలలో వ్యాపారులు సహకరిస్తుండటంతో అక్కడ మార్కెట్ అధునీకరణ పనులు సాగుతున్నాయన్నారు. పట్టణం విస్తరిస్తున్నందు వల్ల మరి కొద్ది ప్రదేశాల్లో కూడా కూరగాయల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని ప్రస్తుతమున్న మార్కెట్ ఏ ఒక్కరి సొంతం కాదని, పురపాలక సంఘానికి సంబంధించిందన్నారు. ప్రస్తు త మార్కెట్ వేలం ద్వారా రూ.58లక్షలు మాత్రమే ఆదాయం వస్తుందని, అధునీకరిస్తే మరింత ఆదాయాన్ని పొందే అవకాశాలున్నాయన్నారు. ఈ సందర్భంగా వ్యాపార సం ఘాల ప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన జీవోల ప్రకారం భవిష్యత్‌లో మాకందరికి మార్కెట్‌లో చోటు దొరకదని అందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ గంగాప్రసాద్, మార్కెట్ వ్యాపార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.