నీట మునిగి ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2020-12-11T04:57:10+05:30 IST

నీటిలో మునిగిపోతున్న బాలుడిని కాపాడబోయి వృద్ధుడు కూడా మృత్యువాత పడిన ఘటన గురువారం రాయచోటి మండలం గొర్లముదివీడులో జరిగింది.

నీట మునిగి ఇద్దరు మృతి
మృతిచెందిన అయూబ్‌, వెంకట్రమణ

మునిగిపోతున్న బాలుడిని కాపాడబోయి వృద్ధుడు కూడా..

రాయచోటిటౌన్‌, డిసెంబరు 10: నీటిలో మునిగిపోతున్న బాలుడిని కాపాడబోయి వృద్ధుడు కూడా మృత్యువాత పడిన ఘటన గురువారం రాయచోటి మండలం గొర్లముదివీడులో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. గొర్లముదివీడు కస్పాకు చెందిన అస్లాం కుమారుడు అయూబ్‌ (12) తమ ఊరికి పక్కనే ఉన్న మాండవ్య నదిలో మఽధ్యాహ్నం ఈతకొట్టేందుకు వెళ్లాడు. ఈత కొడుతూ నీటిలో మునిగిపోతుండగా అక్కడే బట్టలు ఉతుకుతున్న రజకుడు వెంకటరమణ(62) గమనించి బాలుడిని కాపాడేందుకు నీటిలోకి దూకాడు. అయితే  దురదృష్టవశాత్తు అతను కూడా మునిగిపోయాడు. దీన్ని గమనించిన వృద్ధుని భార్య కేకలు వేసింది. దీంతో గ్రామస్థులు వచ్చి ఇద్దరినీ బయటకు తీసి 108 వాహనంలో రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే వారిద్దరూ మృతిచెందారని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నరసింహారెడ్డి తెలిపారు.

Updated Date - 2020-12-11T04:57:10+05:30 IST