వర్షాలకు వందలాది జీవాలు మృతి

ABN , First Publish Date - 2020-11-27T05:30:00+05:30 IST

మండలంలోని నసంతపురం, రాజుపాళెంతో పాటు పలు గ్రామాల్లో గొర్రెలు మృతి చెందాయి.

వర్షాలకు వందలాది జీవాలు మృతి
మృతి చెందిన గొర్రెలను పరిశీలిస్తున్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి

కన్నీటి పర్యంతమవుతున్న యజమానులు

ఆదుకోవాలని వేడుకోలు

నివర్‌ తుఫాను కారణంగా ఎడతెరపి లేని వర్షాలతో జిల్లా వ్యాప్తంగా వందలాది గొర్రెలు మృత్యువాత పడ్డాయి.  ఈదురుగాలులు, చలికి గొర్రెలు మృతి చెందాయి. దీంతో తాము  తీవ్రంగా నష్టపోయామని  గొర్రెల యజమానులు కన్నీటిపర్యంతమవుతున్నారు.  ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి సాయం అందేలా చూడాలని కోరుతున్నారు. వివరాల్లోకి వెళితే...

కమలాపురం, నవంబరు 27: మండలంలోని నసంతపురం, రాజుపాళెంతో పాటు పలు గ్రామాల్లో గొర్రెలు మృతి చెందాయి. ఒక్క నసంతపురం గ్రామంలోనే దాదాపు 200 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, టీడీపీ కమలాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి పుత్తా నరసింహారెడ్డి మృతి చెందిన గొర్రెలను పరిశీలించి యజమానులతో మాట్లాడారు. పశుసంవర్ధకశాఖ ఏడీ, డీడీలతో మాట్లాడుతూ గొర్రెల యజమానులకు బీమా అందేలా చూడాలని కోరారు.

దువ్వూరులో.... : మండల వ్యాప్తంగా సుమారు 50 గొర్రెలు మృతిచెందాయి. దువ్వూ రు, చల్లబసాయిపల్లె గ్రామాలకు చెందిన తిమ్మయ్య, మల్లికార్జున, గంగయ్య, పుల్ల య్యలకు చెందిన 50 గొర్రెలు మృతి చెందాయి. తహసీల్దారు దామోదర్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని మృతి చెందిన గొర్రెలను పరిశీలించారు. అలాగే మైదుకూరు మండలంలో 65 గొర్రెలు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.  

బ్రహ్మంగారిమఠంలో...: మండలంలో 379 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. రేకలకుంట పంచాయతీలో 100, చీకటివారిపల్లెలో 20, ఆర్‌.గొల్లపల్లెలో 30, పెద్దిరాజుపల్లెలో 15, కమ్మవారిపల్లెలో 15, మల్లెగుడిపాడులో 8, చౌదరిపల్లెలో 30, శ్రీరాంనగర్‌ 44, చెం చయ్యగారిపల్లె 98, సోమిరెడ్డిపల్లెలో 10, మల్లేపల్లెలో 3, ముడమాల 4, నాగిశెట్టిపల్లెలో 2 గొర్రెలు మృత్యు వాతపడ్డాయి. పశువైద్యశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కృష్ణయ్య, వెటర్నరీ డాక్టర్లు నిత్యానంద్‌, కె.శిరీషలు సంఘటన స్థలానికి వెళ్లి గొర్రెలను పరిశీలించి నివేది కను ప్రభుత్వానికి పంపుతామన్నారు.  

గోపవరంలో... : మండల పరిధిలో సుమారు 210 గొర్రెలు మృతి చెందినట్లు తహసీల్దార్‌ సరస్వతి, ఏఆర్‌ఐ నాగేశ్వరి తెలిపారు. ఓబులమ్మ అనే మహిళకు చెందిన 35 గొర్రెలు, రమేష్‌ అనే వ్యక్తికి చెందిన 20 గొర్రెలు చెందాయన్నారు. అలాగే ఎస్‌.రామాపురం, వల్లెలవారిపల్లెలో గొర్రెలు మృత్యువాత పడ్డాయన్నారు.  

బి.కోడూరులో... :  మండలంలోని రామచంద్రాపురం, బి.కోడూరు, రెడ్డివారిపల్లె, అంకనగొడుగునూరు గ్రామాల్లో దాదాపు 150 గొర్రెలు మృతి చెందాయి. ప్రభుత్వం ఆదుకోవాలని గొర్రెల యజమానులు విజ్ఞప్తి చేశారు. 

కాశినాయనలో... : మండలంలోని నాయనపల్లె, అమగంపల్లె, ఇటుకులపాడు తదితర గ్రామాలకు చెందిన దాదాపు 35 గొర్రెలు, మేకలు చనిపోయాయి. ప్రభుత్వం ఆదుకోవాలని జీవాల కాపరులు కోరారు. 

పోరుమామిళ్లలో... : మండలంలోని క్రిష్ణంపల్లెలో 31 గొర్రెలు మృతి చెందాయని తహసీల్దారు అయుబ్‌ఖాన్‌ తెలిపారు. నష్టానికి సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి పంపుతున్నట్లు ఆయన తెలిపారు.

వేములలో... : మండలంలో 55 గొర్రెలు మృతి చెందినట్లు తహసీల్దార్‌ నరసింహులు తెలిపారు. నారేపల్లెలో 40 గొర్రెలు, కొండ్రెడ్డిపల్లెలో 15 గొర్రెలు వర్షానికి తడిచి మృతి చెందాయన్నారు.  

చక్రాయపేటలో... :  మండలంలోని తిమ్మారెడ్డిగారిపల్లెలో గురువారం రాత్రి 36 గొర్రెలు మృతిచెందాయని తహసీల్దార్‌ సత్యానందం తెలిపారు. చొక్కా నారాయణ, ఆవుల ఈశ్వరయ్య, ఆవుల రామచంద్ర, చిన్నయ్య, ఉత్తన్నలకు చెందిన గొర్రెలు మృతి చెందాయని తెలిపారు.  

ఒంటిమిట్టలో... : మండలంలోని పెన్నపేరూరు గ్రామంలో శుక్రవారం 10గొర్రెలు మృతి చెందాయి. వర్షంలో తడవడంతో చలికి తట్టుకోలేక గొర్రెలు మృత్యువాత పడ్డాయని గొర్రెల యజమాని పసుపులేటి గంగులయ్య ఆవేదన వ్యక్తం చేశారు. నెల క్రితం 70వేల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశానని, ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2020-11-27T05:30:00+05:30 IST