టీడీపీ శవ రాజకీయాలు దారుణం

ABN , First Publish Date - 2020-12-31T05:17:13+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ శవ రాజకీయాలు చేయడం దారుణమని ఉప ముఖ్యమంత్రి అంజద్‌బాషా, వైసీపీ కడప పార్లమెంటు అధ్యక్షుడు కె.సురే్‌షబాబులు విమర్శించారు.

టీడీపీ శవ రాజకీయాలు దారుణం
విలేకరులతో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం అంజద్‌బాషా

డిప్యూటీ సీఎం అంజద్‌బాషా

కడప(ఎర్రముక్కపల్లె), డిసెంబరు 30: టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ శవ రాజకీయాలు చేయడం దారుణమని ఉప ముఖ్యమంత్రి అంజద్‌బాషా, వైసీపీ కడప పార్లమెంటు అధ్యక్షుడు కె.సురే్‌షబాబులు విమర్శించారు. కడప వైసీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రొద్దుటూరులో జరిగిన టీడీపీ నేత సుబ్బయ్య హత్య కేసుకు సంబంధించి చంద్రబాబు, లోకేష్‌ ఆరోపణలు చేయడం సిగ్గు చేటన్నారు. 2004లో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఫ్యాక్షన్‌ను అంతం చేశారని, కులాలు, మతాలు అడ్డు పెట్టుకుని టీడీపీ నాయకులు రాజకీయం చేస్తుండడం సరికాదన్నారు. రాష్ట్రంలో ఏది జరిగినా దాన్ని అధికార పార్టీపై వేయాలని చూడడం దారుణమన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు దుగ్గాయపల్లె మల్లిఖార్జునరెడ్డి, ప్రసాద్‌రెడ్డి, యానాదయ్య, పులి సునీల్‌కుమార్‌, షఫి పాల్గొన్నారు.

Updated Date - 2020-12-31T05:17:13+05:30 IST