పురుగుల మందు తాగి విద్యార్థి మృతి

ABN , First Publish Date - 2020-12-06T05:01:01+05:30 IST

మండలంలోని రేపల్లె గ్రామానికి చెందిన కంభంపాటి అంజయ్య కుమారుడు వంశీకృష్ణ (21) అనే విద్యార్థి పురుగుల మందు తాగి మృతి చెందినట్లు ఎస్‌ఐ హరిప్రసాద్‌ తెలిపారు.

పురుగుల మందు తాగి విద్యార్థి మృతి
మృతుడు వంశీకృష్ణ

చాపాడు, డిసెంబరు 5: మండలంలోని రేపల్లె గ్రామానికి చెందిన కంభంపాటి అంజయ్య కుమారుడు వంశీకృష్ణ (21) అనే విద్యార్థి పురుగుల మందు తాగి మృతి చెందినట్లు ఎస్‌ఐ హరిప్రసాద్‌ తెలిపారు. రాజువారిపేట వద్ద గుండ్ల వంక పక్కన మృతదేహాన్ని శనివారం కను గొన్నట్లు ఆయన తెలిపారు. ఎస్‌ఐ వివరాల మేరకు... వంశీకృష్ణ ప్రొద్దుటూ రు పట్టణంలోని రాణి తిరుమలదేవి డిగ్రీ కాలేజీలో డిగ్రీ చివరి సంవత్సరం చదు వుతున్నాడు. ఈనెల రెండో తేదీన అతను కనిపించడం లేదని ఆయన సోదరుడు రా మాంజనేయులు ఫిర్యాదు చేశారు. వంశీకృష్ణ పురుగుల మందు తాగి చనిపోయే ముందు చివరిసారిగా తమ స్నేహి తుడికి సెల్‌ఫోన్‌ ద్వారా కాల్‌చేసి మాట్లాడినట్లు తెలిపారు. మృతదేహాన్ని ప్రొద్దుటూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహిం చామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొ న్నారు. విద్యార్థి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Updated Date - 2020-12-06T05:01:01+05:30 IST