-
-
Home » Andhra Pradesh » Kadapa » deadbodies
-
మృతదేహాలను వెలికి తీయడంలో ఫైర్ సిబ్బంది, జాలర్ల సేవలు అభినందనీయం
ABN , First Publish Date - 2020-12-20T05:10:00+05:30 IST
మృతదేహాలను వెలికితీయడంలో ఫైర్‌సిబ్బంది, జాలర్ల సేవలు అభినందనీయమని ఎస్‌ఐ రమేష్ తెలిపారు.

సిద్దవటం, డిసెంబరు19 : మృతదేహాలను వెలికితీయడంలో ఫైర్‌సిబ్బంది, జాలర్ల సేవలు అభినందనీయమని ఎస్‌ఐ రమేష్ తెలిపారు. రెండు రోజుల క్రితం తిరుపతి కొర్లకుంట నుంచి వచ్చిన మిత్రబృందం సరదాగా నదిలోకి దిగి గల్లంతయ్యారు. ఒకరిని ఒకరు రక్షించేందుకు చేసిన ప్రయత్నంలో ఏడుగురు మృత్యువాత పడిన విషయం అందరికీ విధితమే. పోలీసుల సంకల్పానికి ఫైర్ డిపార్ట్‌మెంట్, స్థానిక జాలర్ల శ్రమ తోడై చనిపోయిన వారి మృతదేహాలను బయటికి తీశారు. మృతుల బంధువులకు మృతదేహాలను అప్పగించడం జరిగిందన్నారు.