-
-
Home » Andhra Pradesh » Kadapa » Daytoday tasks should be completed expeditiously
-
నాడు-నేడు పనులను త్వరితగతిన పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2020-12-31T04:58:12+05:30 IST
నాడు-నేడు పనులను త్వరితగతిన పూర్తిచేయాలని జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు.

ముద్దనూరు డిసెంబరు 30: నాడు-నేడు పనులను త్వరితగతిన పూర్తిచేయాలని జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. మండలంలోని పలు పాఠశాలలను బుధవారం సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. బాలుర ఉన్నత పాఠశాల, స్టేషన్ స్కూల్, బడుగువారిపల్లె పాఠశాలను పరిశీలించి పనులపై ఆరా తీశారు. బాలుర ఉన్నత పాఠశాల ఆరుబయట నల్ల బండల చప్పట సరిగాలేదన్నారు. స్టేషన్ స్కూల్ ద్వారం వద్ద ఆర్చ్ ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం మధ్యాహ్న భోజనం పరిశీలించి గ్యాస్‌తోనే వంటలు చేయాలని నిర్వాహకులకు సూచించారు. ఎంఈవో విజయభాస్కర్‌రెడ్డి, సీఆర్పీ తిరుపతయ్య హెచ్‌ఎంలు మనోహర్‌రెడ్డి, సాంబశివారెడ్డి పాల్గొన్నారు.